: రమ్యకృష్ణకు క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిర్మించిన 'బాహుబలి' సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది. అయితే శివగామి పాత్ర కోసం మొదట రమ్యకృష్ణను అనుకోలేదట. శ్రీదేవితో పాటు మరికొందరు బాలీవుడ్ నటీమణులతో ఈ పాత్రను చేయించాలని రాజమౌళి అనుకున్నాడట. అయితే, శ్రీదేవి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో... ఆయన వెనకడుగు వేశాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళే చెప్పాడు. రమ్యకృష్ణ అందుబాటులో ఉన్నప్పటికీ, వేరే వారికోసం ప్రయత్నించానని... దీనికి తాను సిగ్గు పడుతున్నానని తెలిపాడు. సభాముఖంగా ఆమెకు క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించాడు.