: కొడాలి నాని కంచుకోటలో వైసీపీకి పరాభవం
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కంచుకోట అయిన కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ 19వ వార్డుకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, ఇక్కడ గెలుపొంది వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీలు వ్యూహాత్మకంగా తలపడ్డాయి. చివరకు, వైకాపా అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి నండూరి వెంకటప్రసాద్ విజయం సాధించారు. 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు విజయోత్సాహంలో మునిగిపోగా, వైసీపీ వర్గీయులు నిరాశలో మునిగిపోయారు.