: గుడివాడలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టీడీపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఆ ర్యాలీ ఓ థియేటర్ వద్దకు రాగానే వైసీపీ కార్యకర్తలు అక్కడ తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపు చేస్తున్నారు.