: రాష్ట్ర రాజధాని ప్రాంతంలో టీడీపీకి షాక్.. వైసీపీ అభ్యర్థి గెలుపు!
రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మున్సిపాలిటీ ఉప ఎన్నికలో అధికార టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి రాజీనామాతో ఈ మున్సిపాలిటీలోని 31వ వార్డుకు ఉప ఎన్నిక జరిగింది. వ్యక్తిగత కారణాలతో టీడీపీ అభ్యర్థి మురళీకృష్ణ రాజీనామా చేశారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి దర్నాసి రాజారావుపై వైసీపీ అభ్యర్థి మేరుగమల్లి వెంకటరమణ 153 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజధాని ప్రాంతంలో ప్రతిపక్ష అభ్యర్థి గెలుపొందడంతో టీడీపీ నేతలు షాక్ కు గురయ్యారు.