: కార్తీ తాజా సినిమా 'చెలియ'పై వివాదం.. వివరణ!
తమిళ నటుడు కార్తీ నటించిన చిత్రం 'చెలియా'పై వివాదం అలముకుంది. అదితీ రావు హైదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరో, ఇద్దరు సైనికులు పాకిస్థాన్ జైలు నుంచి తప్పించుకునే సన్నివేశం ఉంది. ఈ సన్నివేశాన్ని 'డిసెండెంట్స్ ఆఫ్ ది సన్' అనే హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. దీంతో, సినిమా యూనిట్ కి తలనొప్పులు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ వివరణ ఇచ్చింది. 1971 డిసెంబర్ 10న పాకిస్థాన్ సైనికులకు పట్టుబడ్డ వైమానికదళ లెఫ్టినెంట్ దిలీప్ పరుల్కర్ 'ఫోర్ మైల్స్ టు ఫ్రీడమ్' పేరుతో రాసిన పుస్తకం ఆధారంగానే ఈ సన్నివేశాలను చిత్రీకరించామని తెలిపింది.