: నైట్‌రైడర్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి క్రిస్ లిన్ ఔట్!


ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. విధ్వంసకర ఆటగాడిగా పేరున్న క్రిస్ లిన్ ఐపీఎల్ సీజన్ మొత్తం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో లిన్  43 బంతుల్లో 93 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన లిన్ ఆ తర్వాతి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే గాయం తీవ్రతను బట్టి చూస్తే ఈ సీజన్ మొత్తం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైట్ రైడర్స్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అదే జరిగితే కోల్‌కతాకు పెద్ద దెబ్బే.

  • Loading...

More Telugu News