: ఖైరతాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు!


హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఈ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సర్కిల్‌లోని బైపాస్‌ రోడ్డులో రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకువచ్చిన బెంజికారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారు నంబరు ప్రకారం ఇది అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News