: వచ్చిపడుతున్న చెల్లింపు బ్యాంకులు.. త్వరలో ఫినో నుంచి పేమెంట్ బ్యాంకు
గతేడాది నోట్ల రద్దు తర్వాత దేశంలో పేమెంట్ బ్యాంకులు ఒక్కొక్కటిగా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు చెల్లింపు బ్యాంకులను ప్రారంభించగా ఇప్పుడు ఫినో కూడా పేమెంట్ బ్యాంకును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో మరో రెండు నెలల్లో బ్యాంకును ప్రారంభించనున్నట్టు సమాచారం. ఐసీఐసీఐ సహకారంతో రెండు నెలల లోపే బ్యాంకును ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిషి గుప్తా తెలిపారు. ఫినోకు తుది అనుమతులు ఇచ్చేందుకు గత నెలలోనే ఆర్బీఐ సుముఖత వ్యక్తం చేసినా మరికొన్ని అనుమతులు రావాల్సి ఉంది. ఈ పేమెంట్ బ్యాంకులో ఐసీఐసీఐ 20 శాతం వాటాను కలిగి ఉంటుంది. ఫినో బ్యాంకు ఖాతాలోని సొమ్ముకు 4 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు సమాచారం.