: అమిత్ షా ను కలిసిన మోత్కుపల్లి!
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ను టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కలిశారు. త్వరలో ఆయా రాష్ట్రాల గవర్నర్ల మార్పులపై నిర్ణయం తీసుకుంటామని మోత్కుపల్లికి అమిత్ షా హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే, మోత్కుపల్లిని ఏ రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులుకు గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ, బీజేపీ వర్గాల్లో గతంలో బాగానే ప్రచారం జరిగింది. కానీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయలేదు. తాజాగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను మోత్కుపల్లి కలవడంతో ఆయనకు గవర్నర్ గిరీ దక్కుతుందనే వార్తలు మళ్లీ తెరపైకి రావడం గమనార్హం.