: నాది జర్నలిజం బ్యాక్ గ్రౌండ్... ఛానెల్ పెట్టాలనే ఆలోచన ఉంది!: భూమా మౌనిక


అక్క అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, సీఎం చంద్రబాబు నాయుడుకు తాము కృతఙ్ఞతలు చెప్పుకున్నామని భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనిక అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నాన్న ఉండి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే, భూమా నాగిరెడ్డి మంత్రి పదవి తీసుకోవడమనేది..నంద్యాల, ఆళ్ళగడ్డ ప్రజల చిరకాల కోరిక. అక్క కూడా అంతే కష్టపడి మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాము. మాకు అక్కపై ఆ నమ్మకం ఉంది’ అని చెప్పారు. తనది జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ అని, ఛానెల్ పెట్టాలనే ఆలోచన ఉందని .. ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి ప్రణాళిక దశలో ఉందని మౌనిక చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News