: నంద్యాల సీటును వదిలిపెట్టే ప్రసక్తే లేదు: భూమా చిన్న కూతురు మౌనికా రెడ్డి


నంద్యాల సీటును ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఫ్యామిలీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనికా రెడ్డి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ఈ నియోజకవర్గాన్ని నా తండ్రి ఎంతో అభివృద్ధి చేశారు. భూమా నాగిరెడ్డి అంటే ఒక నమ్మకం.. ఆ నమ్మకాన్ని ప్రజల్లో ఓ స్థాయికి నాన్న తీసుకువెళ్లిపోయారు. నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికలో మా కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారు. మా పెదనాన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి పోటీ చేసినా ఓకే. నా సొంత సోదరుడు పోటీ చేస్తే ఎంత సంతోషంగా ఫీలవుతానో, బ్రహ్మానందరెడ్డి పోటీ చేసినా అంతే ఫీలవుతాను’ అని మౌనిక చెప్పారు. 

  • Loading...

More Telugu News