: పెళ్లిపై నాకు నమ్మకం లేదు: దర్శకుడు డాలీ
పెళ్లిపై తనకు నమ్మకం లేదని, ఈ విషయాన్ని ఇంట్లో చెబితే తనను తిట్టారని ‘కాటమరాయుడు’ దర్శకుడు కిషోర్ పార్థసాని (డాలీ) చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు ఒంటరిగా ఉండటమంటేనే ఇష్టమని, పెళ్లిపై తనకు నమ్మకం లేదన్న విషయాన్ని క్రమక్రమంగా తమ ఇంట్లో వాళ్లు అర్థం చేసుకున్నారన్నారు. తనకు సమయం దొరికినప్పుడల్లా తన మిత్రులతో లాంగ్ రైడ్ కు వెళ్లిపోతానని చెప్పారు. పెళ్లయిన వాళ్లకు ఇలా వెళ్లే అవకాశం ఉండదని, భార్యా పిల్లలు ఉంటారు కనుక వీలుపడదని అన్నారు. ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘నాకు సినిమాతో ఎప్పుడో పెళ్లి అయిపోయింది.. మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు’ అని డాలీ అన్నారు.