: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొత్తగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు పూజలు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కొత్తగా నిర్మించిన ఇంట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం గృహ ప్రవేశం చేశారు. అనంతరం సత్యనారాయణ వ్రతం చేశారు. ఆ ఇంట్లో నిన్న వాస్తుపూజ, హోమం నిర్వహించారు. పూర్తి సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలకి నారా, నందమూరి కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడి కుటుంబం నగరంలోని పార్క్ హయత్ హోటల్‌లోని సర్వీసు అపార్టుమెంటులో ఉంటోంది. ఈ నెల చివర్లో వారు కొత్త ఇంట్లోకి మారనున్నారు.