: టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి బై చెబుతారా?
కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్టుగా, శిల్పా తన నివాసంలో ఓ రహస్య భేటీ నిర్వహించారని, ఆయన సన్నిహితులతో మాట్లాడారని తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తనకు టీడీపీ తరపున టికెట్ లభించకపోతే, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారని, వైఎస్సార్సీపీలో చేరతారని ఆయన సన్నిహితుల సమాచారం. నంద్యాల ఉప ఎన్నిక టికెట్ లభించని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా అక్కడి నుంచి బరిలోకి దిగుతారనే వార్తలు వినవస్తున్నాయి.