: భారతీయ నేవీ అధికారి కులభూషణ్‌ యాదవ్‌ కు పాకిస్థాన్‌లో మరణ శిక్ష!


గూఢచర్యం నేరారోప‌ణ‌ల‌పై గ‌త ఏడాది మార్చి 3న‌ అరెస్టయిన భారతీయ నేవీ అధికారి కులభూషణ్‌ యాదవ్‌కు పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు ఈ రోజు మ‌ర‌ణ‌ శిక్ష విధించింది. త‌మ దేశాన్ని దెబ్బ‌కొట్టేలా ఆయ‌న ప‌లు కుట్రలు పన్నాడని పేర్కొంటూ ఈ శిక్ష విధించిన‌ట్లు పాకిస్థాన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ సందర్భంగా పాక్ విడుద‌ల చేసిన ఓ వీడియోలో కుల భూషణ్‌ మాట్లాడుతూ తాను భార‌త‌ నేవీ ఆఫీసర్‌నని చెప్పాడు.

కుల‌భూష‌ణ్‌ పదవీ విరమణ చేశాడ‌ని, ప్ర‌స్తుతం భారత ప్రభుత్వంతో ఆయ‌న‌కు అధికారిక సంబంధాలు లేవని పాకిస్థాన్ తెలిపింది. కుల‌భూష‌ణ్‌ గ‌త ఏడాది ఇరాన్‌ నుంచి బలూచిస్థాన్ కు రాగానే పాక్‌ అరెస్టు చేసింది. పాకిస్థాన్ కుల‌భూష‌ణ్‌ను రీసర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ (రా)వింగ్‌ అధికారిగా పేర్కొంది. అయితే, ఆయ‌న‌కు మరణ శిక్ష విధించడంపై భారత్ మండిప‌డింది. ఎటువంటి ఆధారాలు లేకుండా మ‌ర‌ణ‌శిక్ష ఎలా విధిస్తార‌ని నిల‌దీసింది.

  • Loading...

More Telugu News