: నల్లగా ఉన్నవారు మంచివారు కాదంటే ఎలా?: జేసీ దివాకర్ రెడ్డి
దక్షిణాది వారి నలుపు రంగు గురించి బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. తెల్లగా ఉన్నవారు మంచివారు, దార్శనికులు... నల్లగా ఉన్నవారు మంచివారు కాదనుకుంటే ఎలాగని మండిపడ్డారు. ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిత్వాన్నైనా రంగుతో నిర్ణయించడం మంచిది కాదని అన్నారు. హిందీ ప్రజలు, హిందీయేతర ప్రజలు అనే వివక్ష కచ్చితంగా ఉందని ఆయన అన్నారు. నా ఊరు, నా ప్రాంతం, నా జిల్లా అనే భావనలతోనే ఇలాంటి ఘటనలు తలెత్తుతున్నాయని చెప్పారు. భారతీయులంతా ఒకటే అనే భావంతో మెలగాలని అన్నారు.