: చంద్రబాబు, కేసీఆర్ ల వల్లే మన గొంతును ఢిల్లీలో గుర్తిస్తున్నారు: కవిత


హిందీ మాట్లాడేవారికి, ఉత్తరాది రాష్ట్రాల వారికే పార్లమెంటులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత మండిపడ్డారు. దక్షిణాది వారి గురించి బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన కామెంట్లు తనను ఎంతగానో బాధించాయని ఆమె అన్నారు. అయినప్పటికీ, తరుణ్ విజయ్ క్షమాపణలు చెప్పినందున ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తేనే మంచిదని సూచించారు. ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాతనే మన ప్రాంత సమస్యలను, అంశాలను ఢిల్లీ పెద్దలు గుర్తిస్తున్నారని అన్నారు. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాడులో ద్రవిడ పార్టీలు వచ్చాకే దేశంలో నెలకొన్న పరిస్థితి మారిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ల వల్లే మన గొంతును ఢిల్లీలో గుర్తిస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో రెండు పార్టీల సిస్టంకు గండి కొట్టాలని... ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News