: 'బాహుబలి' ఈసారి ఫ్లాప్ అయిందట!
టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి, బాక్సాఫీన్ ను కొల్లగొట్టిన 'బాహుబలి' సినిమా ఫ్లాప్ కావడమేమిటి అని అనుకుంటున్నారా? త్వరలో విడుదల అవుతున్న 'బాహుబలి-2' సినిమా ప్రమోషన్ లో భాగంగా 'బాహుబలి' సినిమాను ఉత్తరాదిలో దాదాపు 1000 థియేటర్లలో మళ్లీ విడుదల చేశారు. అంతేకాదు 'బాహుబలి' సినిమాను చూసినవారికి 'బాహుబలి-2' టికెట్లు ఈజీగా దొరికేలా చూస్తామని నిర్మాతలు ప్రకటించారు.
ఇంతచెప్పినా 'బాహుబలి' సినిమాకు ఏమాత్రం స్పందన రాలేదట. వారాంతంలో కూడా ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు వెలవెలబోయాయట. ఇప్పటికే ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడటం, టీవీలో సైతం ఎన్నోసార్లు రావడంతో... మళ్లీ థియేటర్ కు వచ్చి ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడకపోవడమే దీనికి కారణం. ఈ సినిమాకు సంబంధించిన డీవీడీలు కూడా ఎక్కడపడితే అక్కడ లభిస్తున్నాయి. అయితే ఈ సినిమా రెండో భాగం విడుదల కోసం మాత్రం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.