: లైవ్‌లో గోళ్లు గిల్లుకుంటూ దొరికిపోయిన యాంకర్... మీరూ చూడండి!


న్యూస్ ప్రజెంట‌ర్లు వార్త‌లు చ‌దువుతున్న క్ర‌మంలో విజువ‌ల్స్ వ‌స్తున్న‌ప్పుడు, బ్రేక్ స‌మ‌యంలో కాస్త రిలాక్స్ అవుతార‌న్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఒక్కోసారి కెమెరా ఆన్ అయింద‌న్న విష‌యం తెలుసుకోకుండా మామూలుగా ప్ర‌వ‌ర్తిస్తూ ప్రేక్ష‌కులకు దొరికిపోతారు. ఏబీసీ 24 చానెల్‌కు చెందిన న‌టాషా అనే ఆ యాంక‌ర్ కూడా అలానే దొరికిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్‌లో హల్‌చేస్తూ అంద‌రినీ న‌వ్విస్తోంది. తాను లైవ్‌లో ఉన్న విష‌యాన్ని మ‌ర‌చిపోయి గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది. అయితే, ఒక్క‌సారిగా కెమెరా ఆన్ అయింద‌న్న విష‌యాన్ని తెలుసుకొని ఉలిక్కిప‌డింది. వెంట‌నే క‌వ‌ర్ చేస్తూ స్పోర్ట్స్ న్యూస్ చూద్దామంటూ బులెటిన్‌ను కొన‌సాగించింది. గ‌తంలోనూ ఈ యాంక‌ర్ ఓ విషాద‌యాత్ర చ‌దువుతున్న స‌మ‌యంలో చిరున‌వ్వు న‌వ్వింది.  

  • Loading...

More Telugu News