: మోదీ ఆఫీస్ ఎదుట అర్ధ నగ్నంగా నిరసన
ఢిల్లీలోని ప్రధాని మోదీ కార్యాలయం ఎదుట తమిళనాడు రైతులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ప్రధాని కార్యాలయంతో పాటు పలు కీలక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండే సౌత్ బ్లాక్ ఎదుట రైతులు అర్ధ నగ్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ రుణాలను మాఫీ చేయాలని, కరవు ప్యాకేజీని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. రకరకాల పద్ధతులలో ఆందోళనలు చేస్తూ, తమ డిమాండ్ ను వినిపిస్తున్నారు.