: చైనాకు పాకిస్థాన్ గాడిదలు... భారీ ప్రాజెక్ట్ యోచన!
చైనాకు తమ దేశం నుంచి గాడిదలను ఎగుమతి చేసే దిశగా పాకిస్థాన్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం చైనా నుంచే పెట్టుబడులు రాబట్టాలని యోచిస్తోంది. గాడిదల చర్మాన్ని మందులతోపాటు పలు ఉత్పత్తులలో వాడుతారు. వీటికి చైనాలో డిమాండ్ అధికంగా ఉంది. దీంతో పాకిస్థాన్ ఇందుకోసం డాంకీ డెవలప్ ప్రోగ్రామ్ పేరిట ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను చైనా ముందు ఉంచింది. తమ దేశంలోని ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ను గాడిదల అభివృద్ధి కోసం పాకిస్థాన్ ఎంపిక చేసుకుని, తమ ప్రాజెక్టు కోసం అక్కడి కరెన్సీ ప్రకారం సుమారు వంద కోట్ల విలువైన గాడిదలను పెంచి, చైనాకు ఎగుమతి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.