: మరో ప్రకటన చేసిన రిలయన్స్ జియో!


వెల్‌కం ఆఫ‌ర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫ‌ర్ల‌తో ఊహించ‌నంత మంది వినియోగ‌దారుల‌ను సంపాదించుకున్న రిల‌య‌న్స్ జియో తాజాగా స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ట్రాయ్ అభ్యంత‌రం చెప్ప‌డంతో ఆ ఆఫ‌ర్‌ను ఇప్ప‌టికే రీఛార్జ్ చేసుకున్న‌ వారికే ప‌రిమితం చేసింది. అయితే, ఈ నెల 16 నుంచి టారిఫ్ ప్లాన్‌లు అమ‌లులోకి రానున్న నేప‌థ్యంలో జియో తాజాగా మ‌రో ప్ర‌క‌టన చేసింది. టారిఫ్ ప్లాన్స్‌ను అప్‌డేట్ చేస్తున్నామని, త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని తెలిపి, త‌మ ప్ర‌త్య‌ర్థి టెలికాం సంస్థ‌ల్లో మ‌ళ్లీ ఆందోళ‌న రేపింది. జియో అతి త‌క్కువ ధ‌ర‌ల‌తో టారిఫ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తుందా? అనే ప్ర‌శ్న జియో యూజ‌ర్ల‌తో పాటు టెలికాం రంగంలో చ‌ర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News