: సత్యంబాబుకు తాత్కాలిక ఉద్యోగం.. కలెక్టర్ హామీ!


ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను హత్య చేశాడన్న ఆరోపణలతో ఎనిమిదేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించిన సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడం.. అతను జైలు నుంచి విడుదల కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రజావాణి కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ను సత్యంబాబు కలిశాడు. పేదవాడినైన తనకు జీవనాధారం కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ను సత్యంబాబు కోరాడు. అంతేకాదు, తన సోదరికి ఏఎన్ఎం ఉద్యోగాన్ని కల్పించాల్సిందిగా విన్నవించాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పందిస్తూ, తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పారు. వెంటనే అందుకు సంబంధించిన ఆదేశాలను కూడా కలెక్టర్ జారీ చేశారు. అంతేకాదు, కాలిపోయిన ఇంటి స్థానంలో సత్యంబాబుకు పక్కా ఇల్లు మంజూరు చేశారు. 

  • Loading...

More Telugu News