: ‘మీసేవ’లోనూ సర్వీసు చార్జీల పెంపు!


ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ‘మీసేవ’ కేంద్రాల ద్వారా సర్కారు అందిస్తున్న సర్వీసులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే, మీసేవ సర్వీసు చార్జీలను కూడా తెలంగాణ ప్ర‌భుత్వం పెంచేసింది. మూడు రోజుల క్రితం నుంచి ఈ ధ‌ర‌లు అమ‌ల్లో ఉన్నాయి. రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే సేవలను ‘ఏ’, ‘బీ’ అనే రెండు కేట‌గిరీలుగా విభ‌జించి సుమారు 60 రకాల సేవలను 'మీసేవ' అందిస్తోంది. అంతేగాక‌, ప‌లు ప్రభుత్వ శాఖలకు చెందిన సర్వీసులను కూడా అందిస్తోంది.

అయితే, ప్ర‌స్తుతం కేటగిరి ‘ఏ’లో ఉండే సేవల సర్వీస్‌ చార్జీలు ప్రస్తుతం రూ.25 ఉండగా కొత్త బాదుడుతో రూ.35కు పెరిగాయి. ఇక‌ కేటగిరి ‘బీ’లో ఉండే సేవల సర్వీస్‌ చార్జీలు రూ.35 నుంచి రూ.45కు పెరిగాయి. పెంచిన చార్జీల‌ ప్రకారం ప్ర‌జ‌ల‌పై ఏడాదికి రూ.5.80 లక్షల భారం పడనుంది. అంతే కాకుండా ఐదు కన్నా ఎక్కువగా ఉన్న స్కానింగ్‌ కాపీలకు ఒక్కోదానికి రూ.2 చొప్పున తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈ రెండు కేటగిరీలకు మాత్ర‌మే చార్జీలు పెరిగాయి.

  • Loading...

More Telugu News