: తీవ్ర కష్టాల్లో యువరాజ్ సింగ్ మాజీ లవర్, నటి కిమ్ శర్మ
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సినీ నటి కిమ్ శర్మ గుర్తుందా? 'ఖడ్గం' సినిమాలో 'ముసుగు వేయొద్దు మనసు మీద... వలలు వేయొద్దు వయసు మీద' అంటూ కుర్రకారును ఉర్రూతలూగించింది. అంతేకాదు, స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో చాలా కాలం పాటు ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత 2010లో బిజినెస్ టైకూన్ అలీ పంజనీని పెళ్లి చేసుకుని, ఆయనతో పాటు కెన్యాకు వెళ్లిపోయింది. ఇటీవలే ఆమె ముంబైకి ఒంటరిగా తిరిగి వచ్చింది. దీంతో, పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆమె భర్త మరో మహిళ మోజులో పడ్డాడని... దీంతో, అతను కిమ్ ను వదిలేశాడని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, కిమ్ కు కనీసం డబ్బు కూడా ఇవ్వకపోవడంతో... కిమ్ ఆర్థిక పరిస్థితి తలకిందులైందని అంటున్నారు. కెన్యా నుంచి వచ్చేయడమే కాకుండా, పంజనీ హోటల్స్ సీఈవో పదవి నుంచి కూడా ఆమె తప్పుకుందట. ప్రస్తుతం ముంబైలో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆమె భావిస్తోందట.
ఇక్కడ ఇంకో వార్త కూడా వినిపిస్తోంది. కెన్యా నుంచి ముంబై తిరిగి వచ్చిన తర్వాత మెన్స్ వేర్ డిజైనర్ అర్జున్ ఖన్నాతో ఆమె సన్నిహితంగా మెలుగుతోందట.