: చిరంజీవిగారూ... మీరు నాకు సైకిల్ బాకీ!: చిరంజీవితో హీరో నాని


సినీ పరిశ్రమలో తనకు బ్యాక్ గ్రౌండ్ లేదని చెబుతుంటారు కానీ, తాను చిరంజీవిగారిని స్పూర్తిగా తీసుకుని సినీ పరిశ్రమలోకి వచ్చానని హీరో నాని చెప్పాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి హాజరైన నాని, ఇకపై తన బ్యాక్ గ్రౌండ్ చిరంజీవి అని చెప్పాడు. అంతే కాకుండా చిరంజీవి తనకు సైకిల్ బాకీ ఉన్నారని అన్నాడు. ఆ సైకిల్ ఇప్పుడివ్వాలని చిరంజీవిని కోరాడు.... 'మాస్టర్' సినిమా రిలీజ్ అయినప్పుడు తాను కాలేజీ ఎగ్గొట్టి అమీర్ పేటలోని సత్యం ధియేటర్ కు సైకిల్ పై వెళ్లానని, అతి కష్టం మీద టికెట్ కౌంటర్ లో దూరి టికెట్ సంపాదించానని అన్నాడు.

తీరా బయటికి వచ్చి చూసుకుంటే, తన సైకిల్ లేదని, అయినా టికెట్ దొరికిన ఆనందంలో సినిమా చూసేశానని, సినిమా పూర్తయి, బయటకు వచ్చిన తరువాత సైకిల్ గురించి ఏం చెప్పాలో అర్ధం కాలేదని, ఇంట్లో ఏవో కథలు చెప్పి నమ్మించానని తెలిపాడు. 'భలే భలే మగాడివోయ్' సినిమా చేస్తున్నప్పుడు ఈ విషయం చెబితే సైకిల్ కొనిస్తానన్నారని, తరువాత మర్చిపోయారని, దానిని ఇప్పుడు చిరంజీవి గారు ఇవ్వాల్సిందేనని నాని అన్నాడు. దీంతో హాయిగా నవ్వేసిన చిరంజీవి... 'నీకు సైకిల్ కావాలంటే ఆనందంగా ఇస్తాను నానీ...'అని అన్నారు. వీరి సంభాషణ అభిమానులను అలరించింది. 

  • Loading...

More Telugu News