: అవన్నీ కేవలం పుకార్లే: శశిథరూర్
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గత కొంత కాలంగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ వ్యాఖ్యలపై శశిథరూర్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. బీజేపీలో చేరుతున్నారా? అంటూ ఇప్పటి వరకు తనను చాలా మంది ప్రశ్నించారని, అయితే తాను బీజేపీలో చేరడం లేదని... ఆ వార్తలన్నీ కేవలం పుకార్లేనని చెప్పారు.
ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ పథకం చాలా బాగుందని శశిథరూర్ గతంలో ప్రకటించారు. దీంతో, శశి వ్యాఖ్యలు కేరళలోని కాంగ్రెస పార్టీకి హాని కలిగించేలా ఉన్నాయంటూ తమ అధినేత్రి సోనియాగాంధీకి ఆ రాష్ట్ర పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. దీంతో, క్రమశిక్షణా చర్యల కింది ఆయనను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తొలగించారు.