: స్టేజ్ షో లలో నటించడమంటే చచ్చేంత భయమంటున్న విద్యాబాలన్


తనకు స్టేజ్ షోలలో నటించడమంటే చచ్చేంత భయమంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్. ఆమె నటించిన 'బేగమ్ జాన్' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ, తాను పెద్దగా వార్తలు చదవనని తెలిపింది. అయితే సీనియర్ నటి షబానా అజ్మీకి తాను స్టేజ్ షో చేస్తే చూడాలని ఉందని ఓ సమయంలో చెప్పిందని సిద్ధార్థ్‌ రాయ్ కపూర్ (విద్యా బాలన్ భర్త) తనకు చెప్పాడని తెలిపింది. తాను ఆరాధించే నటి నుంచి అంత గొప్ప ప్రశంస వచ్చినందుకు చాలా సంతోషించానని చెప్పిన విద్యాబాలన్, స్టేజ్ షోలో ప్రత్యక్షంగా ప్రేక్షకుల ముందు నటించాలన్న విషయం గుర్తొస్తేనే భయపడిపోతానని తెలిపింది. అందుకే తాను ప్రేక్షకుల ముందు నటించేందుకు సిద్ధంగా లేనని చెప్పింది. 

  • Loading...

More Telugu News