: విమాన టిక్కెట్‌ కొని.. చివరికి రైలులో వెళ్లిన శివసేన ఎంపీ గైక్వాడ్‌


ఎయిరిండియా విమాన సిబ్బందితో దురుసుగా ప్ర‌వ‌ర్తించి, చేయి చేసుకున్న శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌పై విమాన‌యాన సంస్థ‌లు నిషేధం విధించి, మ‌ళ్లీ ఆ నిషేధాన్ని ర‌ద్దు చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న రైలులోనే ప్ర‌యాణించారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లేందుకు విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్న గైక్వాడ్ విచిత్రంగా విమానంలో వెళ్లకుండా రైల్లో వెళ్లారట. గైక్వాడ్‌ పుణె నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఏఐ852లో బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. ఆయ‌న షెడ్యూల్‌ ప్రకారం ఈ రోజు ఉదయం 7.40 గంటలకు విమానంలో వెళ్లాల్సి ఉంది. అయితే, ఆయ‌న ఈ రోజు విమానాశ్ర‌యానికి వెళ్ల‌కుండా నిన్నే పుణె నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో డిల్లీ బయల్దేరినట్లు స‌మాచారం. గత నెలలో ఈ ఏఐ852 విమానంలోనే గైక్వాడ్‌ ఎయిరిండియా సిబ్బందితో దురుసుగా ప్ర‌వ‌ర్తించారు.

  • Loading...

More Telugu News