: ఈజిప్టులో మూడు నెలల పాటు ఎమర్జెన్సీ!


ఈజిప్టులో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నిన్న రెండు చర్చిలపై ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడి, రక్తంపాతం సృష్టించారు. ఐఎస్ఐఎస్ జరిపిన ఈ జంట పేలుళ్లలో 40 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 28న పోప్ ఫ్రాన్సిస్ ఈజిప్టును సందర్శిస్తున్నారు. ఆయన పర్యటనకు కొన్ని రోజుల ముందు ఐసిస్ ఈ దాడులకు పాల్పడటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే, దేశంలో ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ సిసి ఈ రోజు ప్రకటించారు. 

  • Loading...

More Telugu News