: ప్రభాస్ లాంటి పిచ్చోడు ఉంటేనే బాహుబలిలాంటి సినిమాలు తీయగలం: రాజమౌళి


'బాహుబలి'లాంటి సినిమాను మళ్లీ తీయడం సాధ్యమేనని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. అయితే, ప్రభాస్ లాంటి పిచ్చోడు ఉంటేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. 'బాహుబలి-2' సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న చెన్నైలో కన్నులపండువగా జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తాను కనిపించడం లేదని... తొలి భాగంలో కనిపించి చేసిన తప్పును మళ్లీ మళ్లీ చేయబోనని చెప్పారు. రజనీకాంత్ సినిమా '2.0'తో 'బాహుబలి-2'కి పోటీ లేదని అన్నారు. 

  • Loading...

More Telugu News