: దివాకర్ ట్రావెల్స్ బస్సు అద్దాలు ధ్వంసం!


అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సును ఇద్దరు పోకిరీలు ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే, నిన్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి దివాకర్ ట్రావెల్స్ బస్సు హైదరాబాదుకు బయల్దేరింది. మార్గమధ్యంలో మొరసనపల్లె సమీపంలోకి బస్సు వచ్చేసరికి... కుప్పం వైపు బైక్ లపై వస్తున్న ఇద్దరు యువకులు బస్సుపైకి రాళ్లు రువ్వారు. దీంతో, బస్సు ముందువైపు అద్దాలు పగిలి పోయాయి. ఈ నేపథ్యంలో, బస్సు డ్రైవర్ లు పోకిరీలను పట్టుకునేందుకు వారిని వెంబడించి, చివరకు కనుమలదొడ్డి దాటిన తర్వాత పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరోవైపు బస్సు అద్దాలు పగిలిపోవడంతో బస్సు ఆగిపోయింది. దీంతో, ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. 

  • Loading...

More Telugu News