: రోహిత్ శర్మను తీవ్రంగా మందలించిన మ్యాచ్ రెఫరీ
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-10లో ముంబై టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా, ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, పదో ఓవర్లో సునీల్ నరైన్ బౌలింగ్ లో రోహిత్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. ఈ సందర్భంగా అంపైర్ సీకే నందర్ నిర్ణయంపై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్ వైపు బ్యాటును చూపిస్తూ, అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు.
ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మను మ్యాచ్ రెఫరీ తీవ్రంగా మందలించాడు. రోహిత్ ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. ప్రవర్తనా నియమావళిలో లెవెల్-1 నేరం కిందకు రోహిత్ ప్రవర్తన వస్తుందని ఐపీఎల్ కార్యనిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.