: నేడు ఢిల్లీకి చంద్రబాబు.... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై చర్చ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేటి మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏన్డీయే మిత్రపక్షాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో ఎన్డీయే మిత్రపక్షాలతో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఆయన కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారి మిత్రపక్షాల అధినేతలతో నిర్వహించనున్న సమావేశం కావడంతో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా త్వరలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిల ఎన్నిక అనివార్యం కావడంతో దానిపై ఒక స్పష్టత తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తదుపరి భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News