: గోవధ నిషేధాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్


దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌ డిమాండ్‌ చేశారు. మహావీర్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గోవధ పేరుతో ఏ రకమైన హింసనూ అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే గోవధ నిషేధ చట్టం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గో పరిరక్షణ పేరుతో హింసకు పాల్పడడం సరికాదని ఆయన హితవు పలికారు. వారి కారణంగా గోవధ అసలు లక్ష్యం పూర్తిగా తప్పుదారిపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గోపరిరక్షణకు సంబంధించిన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, అవి రాజ్యాంగానికి లోబడి, చట్టబద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు దానిని అమలు చేస్తే ఇతర రాష్ట్రాలు కూడా దానిని అనుసరిస్తాయని ఆయన తెలిపారు. రాజకీయ కారణాల కారణంగా ఇది అమలులోకి రావడానికి అలస్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News