: బాయ్ ఫ్రెండ్ తో బార్ కు వెళ్లిన ఒబామా పెద్ద కుమార్తె... పరుగులు పెట్టిన సీక్రెట్ సర్వీసెస్ సిబ్బంది


అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పెద్ద కుమార్తె మాలియా ఒబామా ఇంటెలిజెన్స్ సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఒబామా పదవీ బాధ్యతల నుంచి నిష్క్రమించిన అనంతరం పెద్దగా బాహ్యప్రపంచం ముందుకు రాని మాలియా... ఇటీవల న్యూయార్క్‌ లోని మాన్‌ హటన్‌ ప్రాంతంలోని ‘బి బార్‌ అండ్‌ గ్రిల్‌’ కు డిన్నర్ కు వెళ్లింది. ఒక్కసారిగా మాలియాను చూసిన పలువురు తమ సెల్ ఫోన్ కెమెరాలకు పని చెప్పారు. ఇవేమీ పట్టించుకోని మాలియా బాయ్‌ ఫ్రెండ్‌ తో కలిసి బార్‌ లో ఒక మూల ప్రశాంతంగా ఉన్నచోట కూర్చొని డిన్నర్‌ కానిచ్చింది.

దీంతో ముందస్తు సమాచారం లేకుండా మాజీ అధ్యక్షుడి కుమార్తె బార్ కు వెళ్లడంతో ఇంటెలిజెన్స్ సర్వీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆమె అక్కడి నుంచి నిష్క్రమించే వరకు ఆ పరిసరాలను అదుపులోకి తీసుకున్నారు. ఆ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని, ఆ సమయంలో బార్ కు వెళ్లిన వారు తెలిపారు. ఇవేవీ పట్టించుకోని మాలియా, ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం హాయిగా డిన్నర్ ముగించి వెళ్లిపోయారని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News