: ఎన్డీయే మీటింగ్ కోసం.. రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు


ఏపీ సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్డీయే పక్షాల భేటీలో ఆయన పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎన్డీయే పార్టీల అధ్యక్షులతో నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలపై , రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక అంశం ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News