: కాలువలోకి దూకి కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి!
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో జరిగింది. ఐదుగురు కుటుంబ సభ్యులు పలివెల కాలువలోకి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరిని బయటకు తీశారు. అయితే, కాలువలో నుంచి బయటకు తీసిన కొద్ది సేపటికే బాలుడు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.