: చెన్నైలో ‘బాహుబలి-2’ తమిళ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్.. ప్రముఖుల హాజరు!
చెన్నైలోని వైఎంసీఏ గ్రౌండ్స్ లో ‘బాహుబలి-2’ తమిళ్ వెర్షన్ ఆడియో రిలీజ్ వేడుక కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దర్శకులు రాజమౌళి, రాఘవేంద్రరావు, హీరో ప్రభాస్, తమన్నా, అనుష్క, నటులు నాజర్, సత్యరాజ్, ధనుష్, సంగీత దర్శకుడు ఇళయరాజా, తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ, దర్శకుడు రాజమౌళికి తన ధన్యవాదాలు తెలిపారు. ప్రభాస్ గురించి ప్రస్తావిస్తూ, ఆంధ్రాలో ప్రభాస్ ను ‘డార్లింగ్’ అని, ‘యంగ్ రెబల్ స్టార్’ అని పిలుచుకుంటారని అన్నారు.