: నాడు చంద్రబాబుపై ఆ కామెంట్ అయితే చేశాను: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
నాడు ఎన్టీ రామారావును పదవి నుంచి దింపినప్పుడు చంద్రబాబుపై తాను తీవ్రంగా మాట్లాడినమాట యథార్థమేనని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబుకు ఎన్టీఆర్ ఆస్తి ఇచ్చారు, అమ్మాయిని ఇచ్చారు. ఇంకా ఈ పదవి కూడా తీసుకోవడమేంటి? అని నాడు చంద్రబాబుపై కామెంట్ చేశా’ అని చెప్పారు.
చంద్రబాబు, యనమల రామకృష్ణుడితో గతంలో విభేదించిన మీరు, ఇప్పుడు కలిసి ఎలా పని చేయగలుగుతున్నారనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ప్రకారం, తాను కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ‘ఎన్టీఆర్ గారిని ఎంత గౌరవిస్తానో.. చంద్రబాబును అంతే గౌరవిస్తాను. ఆయన మా పార్టీ నాయకుడు’ అని అన్నారు.