: ఇరవై ఏళ్లు కాదు.. మరో ఇరవై నెలలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకుంటే చాలు: నాగం జనార్దన్ రెడ్డి


తెలంగాణలో వచ్చే ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ దే అధికారం అంటూ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇరవై ఏళ్లు కాదు, ఇరవై నెలల పాటు తమ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సెక్రటేరియట్ లో అడుగు పెట్టని, అపరిష్కృతంగా పేరుకుపోయిన ఫైళ్లను చూసి టీఆర్ఎస్ కు ఇరవై ఏళ్ల పాటు అధికారం ఇవ్వాలా? అని ప్రశ్నించారు.

బినామీ ఆస్తులు కూడబెడుతున్న కేసీఆర్ కుటుంబానికి .. జయలలితకు పట్టిన గతే పడుతుందని, రైతులను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ అవినీతిపై బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి లేవనెత్తిన అవినీతి అంశాలపై మాట్లాడే దమ్ము టీఆర్ఎస్ నాయకులకు ఉందా? అని నాగం ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News