: వ్యతిరేకిస్తే తలలు నరుకుతాం: రామమందిరం నిర్మాణంపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అయోధ్యలో రామ మందిరం అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ ఇదే అంశంపై మాట్లాడుతూ రామమందిరాన్ని వ్యతిరేకించేవారి తలలు నరుకుతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరంపై కొందరు చేస్తోన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రామమందిరాన్ని కడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొందరు హెచ్చరిస్తున్నారని, వాళ్లు అలా ఎప్పుడు వ్యాఖ్యానిస్తారా? అని తాము వేచి చూస్తున్నామని రాజాసింగ్ అన్నారు. అలా అనేవారి తలలు నరుకుతామని హెచ్చరించారు. గతంలోనూ పలుసార్లు రాజాసింగ్ ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే.