: ఏమడిగినా ఇక్కడ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు: కెనడా దౌత్య కార్యాలయంపై సుష్మా స్వరాజ్ కు సెలబ్రెటీ ఫిర్యాదు


క‌ష్టాల్లో ఉన్నామ‌ని ట్వీటు చేస్తే వెంట‌నే స్పందించే కేంద్ర మంత్రి సుష్మాస్వ‌రాజ్‌కు తాజాగా ప్రముఖ క‌మెడియ‌న్‌ లిల్లీ సింగ్ త‌న బాధ‌ చెప్పుకుంది. ప్రస్తుతం ఆమె టొరంటోలో ఉంది. అయితే, తాను అక్క‌డ‌ వీసా కష్టాలు ఎదుర్కొంటున్నానని, తాను అక్క‌డి ఇండియన్‌ కాన్సులేట్‌ను సంప్రదించాన‌ని సుష్మాస్వరాజ్‌కు చెప్పింది. అక్కడి అధికారులను తాను ఏ ప్రశ్న అడిగినా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేసింది.

త‌నకు ఇండియా అంటే ఇష్టమ‌ని, కానీ టొరంటోలోని భారత దౌత్య కార్యాలయం మాత్రం ప్రపంచంలోనే చెత్తదని ఆమె పేర్కొంది. అక్క‌డి నుంచి ఇండియా రావాలంటే వీసా రావడం చాలా కష్టమ‌ని, ఏదో ఒక రోజు ప్రధాని మోదీ ఈ సమస్య తీరుస్తారనుకుంటున్నాన‌ని తెలిపింది. సుష్మా స్వరాజ్ త‌న‌కు సాయం చేయాల‌ని, అక్క‌డి దౌత్యాధికారులు త‌న‌తో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. ఆమె ట్వీటుపై వెంట‌నే స్పందించిన సుష్మా స్వ‌రాజ్‌ కెనడాలోని భారత హైకమిషనర్‌ వికాస్‌ స్వరూప్‌తో ఆమె విష‌య‌మై మాట్లాడారు.



  • Loading...

More Telugu News