: వినోద్‌ఖన్నాపై వదంతుల ప్రభావం... రెండు నిమిషాలు మౌనం పాటించిన బీజేపీ మేఘాలయా నేతలు


బాలీవుడ్ నటుడు వినోద్‌ ఖన్నాపై పలు పుకార్లు షికార్లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన వైద్యులు, ఆయ‌న కుమారుడు.. వినోద్ ఖన్నా ఆసుప‌త్రిలో కోలుకుంటున్నార‌ని, డీ హైడ్రేష‌న్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని చెప్పిన‌ప్ప‌టికీ ప‌లు వ‌దంతులు ఆగ‌డంలేదు. ఆయన మృతి చెందార‌ని పొరపడిన బీజేపీ మేఘాలయా ప్రధాన కార్యదర్శి డేవిడ్‌ కర్సతి ఆయ‌న‌కు సంతాపంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంత‌రం ప‌లువురు మీడియా ప్ర‌తినిధులు వినోద్‌ ఖన్నా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని చెప్ప‌డంతో ఆ కార్యక్రమాన్ని ఆపేశారు. ఈ సంద‌ర్భంగా క‌ర్సతి మాట్లాడుతూ.. తాము టీవీలో ప్రసారమైన తప్పుడు వార్తలు చూసి పొర‌ప‌డ్డామ‌ని తెలిపారు. త‌మ‌ను క్ష‌మించాల్సిందిగా కోరారు.

  • Loading...

More Telugu News