: గోవుల సంరక్షణ చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గోవధ అంశంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గోవులను అక్రమంగా తరలిస్తున్నారంటూ పలు చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన వర్ధమాన మహావీరుని జయంత్యుత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... గోవుల సంరక్షణ విషయంలో హింసను ప్రేరేపించకూడదని చెప్పారు. అలాగే దేశ వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని ఆయన అన్నారు. గోవుల సంరక్షణ చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, కబేళాలపై దేశ వ్యాప్తంగా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.