: ఈజిప్టులో మరో ఉగ్రదాడి.. 21 మంది మృతి, 42 మందికి గాయాలు
ఈజిప్టులో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గతేడాది డిసెంబరులో జరిగిన ఉగ్రదాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనను మరవకముందే ఈ రోజు మరో ఆత్మాహుతి దాడి జరిగింది. టాంటాలోని సెయింట్ జార్జ్ కాప్టిక్ చర్చి వద్ద జరిగిన ఈ దాడిలో 21 మంది మృతి చెందగా, మరో 42 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న బలగాలు గాయాలపాలయిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అక్కడి కాప్టిక్ క్రిస్టియన్లే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి.