: వైద్యం ఫలిస్తోంది.. ఈజిప్ట్ మహిళ ‘భారీ’తనం తగ్గుతోంది!
అధిక బరువు (498 కేజీలు) తో బాధపడుతున్న ఈజిప్టు దేశీయురాలు ఇమాన్ అహ్మద్ కి ముంబయిలో వైద్యులు చికిత్స అందిస్తోన్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం 340 కేజీలకు చేరుకుంది. తన చేతితో తన ముఖాన్ని కూడా అందుకోలేని స్థితిలో ఉండే ఆమె ఇప్పుడు ముఖాన్ని తన చేతితో తాకగలుగుతోంది. ఈ సందర్భంగా ఆమె హర్షం వ్యక్తం చేస్తూ తనకు చికిత్స అందించిన వైద్యుడు ముఫజల్ లక్డావాలాకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆమె ఆసుపత్రిలోనే ఉంటుంది. ఆమెకు ఫిజియోథెరపీ కూడా అందిస్తున్నారు.