: 40వ అంతస్తు అంచున వేలాడుతూ స్విమ్మింగ్ పూల్.. మీరూ చూడండి!
అమెరికాలోని హోస్టన్ సిటీలో 40వ అంతస్తు చివరన గాజుతో స్విమ్మింగ్ పూల్ నిర్మించి అందరి దృష్టీ ఆకర్షించేలా చేశారు నిర్వాహకులు. ఆ స్విమ్మింగ్ పూల్ సుమారు 500 మీటర్ల ఎత్తులో 40వ అంతస్తు అంచున వేలాడుతూ ఉంది. ఇందులోకి దిగి ఈత కొట్టాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సిందే. దీనికి సంబంధించిన ఓ వీడియోను నిర్వాహకులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. అందులో ఈతకొట్టడానికి జంకే వారి కోసం నిర్వాహకులు నాలుగో అంతస్తులో మరోదాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి 40వ అంతస్తు అంచున వేలాడుతున్న ఆ స్మిమ్మింగ్ పూల్ లోకి దిగి తీసిన వీడియోను మీరూ చూడండి...