: ఉత్తరప్రదేశ్ లోనూ రూ.3కు బ్రేక్‌ఫాస్ట్, రూ.5కు భోజనం పథకం!
తమిళనాడులో జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లు పేదల ఆకలిని తీర్చుతున్న విషయం తెలిసిందే. అయితే, అదే బాటలో నడుస్తూ తమ రాష్ట్రంలోనూ అతి తక్కువ ధరకే భోజనం అందించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. 'అన్నపూర్ణ భోజనాలయ' పేరుతో పేదలకు రూ.3 కే బ్రేక్ ఫాస్ట్, రూ.5 కే భోజనం పెట్టాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే బాధ్యతలను యూపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర‍్య, సురేష్ ఖన్నాలకు అప్పగించారు. మొదట ఈ పథకాన్ని లక్నో, కాన్పూర్, ఘజియాబాద్, గోరఖ్‌పూర్‌లలో ప్రారంభించాలని చూస్తున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 200 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్‌లోనూ ఇటువంటి పథకం అమలులో ఉంది.