: గుడివాడ పురపాలక సంఘం ఉప ఎన్నిక.. ఓటుకు వేల రూపాయలు పంచుతున్న వైనం!


కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఓటుకు పెద్ద మొత్తంలో డబ్బులిస్తామని ఓటర్లకు చెబుతున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన 19వ వార్డు సభ్యుడు మ‌ృతి చెందడంతో ఈ ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల విజయం కోసం టీడీపీ నుంచి రావి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యే కొడాలి నాని రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఆ నేతలు ఉన్నారు. ఓటుకు రూ.7 వేల చొప్పున ఓ వర్గం వారు ఇస్తుండగా, రూ.6 వేలతో పాటు వెండి కుంకుమ భరిణెను  మరోవర్గం వారు ఓటర్లకు పంపిణీ చేస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News